
న్యూస్‌రీల్
కడప సెవెన్‌రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 4నుంచి ప్రారంభమైన పవిత్రోత్సవాలు ముగిశాయి. ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పవిత్ర విసర్జనాలు, మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణ తదితర పూజలను అర్చకులు ఆగమోక్తంతంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చకులతోపాటు ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.