వినాయక నిమజ్జనం వీడియో వైరల్‌పై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనం వీడియో వైరల్‌పై కేసు నమోదు

Sep 4 2025 6:05 AM | Updated on Sep 4 2025 6:05 AM

వినాయ

వినాయక నిమజ్జనం వీడియో వైరల్‌పై కేసు నమోదు

ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పెద్దనపాడు గ్రామంలో ఇటీవల వినాయక నిమజ్జనం ఉరేగింపు వీడియో వైరల్‌ అయిన సంఘటనపై గ్రామంలోని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎర్రగుంట్ల పట్టణ సీఐ విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ పెద్దనపాడు గ్రామంలో వినాయక నిమజ్జనం సమయంలో వినాయకుడి విగ్రహం వెనుక రప్పారప్పా అని రాసిన దృశ్యం సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయింది. దీంతో గ్రామ వీఆర్‌ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీడియోను చూసి అంకాల్‌రెడ్డి, అంకిరెడ్డి, అశోక్‌రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. కాగా మరి కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

జిల్లాలో 14 బార్లకు

రీ నోటిఫికేషన్‌ విడుదల

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : జిల్లాలో 14 బార్లకు రీ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ జయరాజు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 29 బార్లకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా అందులో 15 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటికి డ్రా తీశామన్నారు. మిగిలిన 14 బార్లకు దరఖాస్తులు రాకపోవడంతో నోటిఫికేషన్‌ విడుదల చేశామన్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతిలో ఈనెల 14వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలన్నారు. 15న జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో డ్రా తీస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, సూపరింటెండెంట్‌ రవికుమార్‌ , సీఐ కృష్ణ కుమార్‌ పాల్గొన్నారు.

ఈనెల 8న అప్రెంటీస్‌ మేళా

కడప ఎడ్యుకేషన్‌ : జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణులైన వారికి ఈనెల 8వ తేదీ కడపలోని ప్రభుత్వ డీఎల్‌టీసీ ఐటీఐలో ఉదయం 10 గంటలకు అప్రెంటీస్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్‌, ప్రభుత్వ ఐటీఐ మైనారిటీస్‌ ప్రిన్సిపాల్‌ జ్ఞానకుమార్‌ తెలిపారు. అర్హత ఉన్న విద్యార్థులు తమ 10వ తరగతి మార్కుల జాబితా, ఐటీఐ మార్కుల జాబితా, ఐటీఐ ఎన్‌టీసీ సర్టిఫికెట్‌, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు అకౌంట్స్‌ పుస్తకం, పాస్‌పోర్టు సైజు ఫొటోతో పాటు ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలు తీసుకుని రావాలని తెలిపారు. ఎంపికై న వారికి అప్రెంటిస్‌ శిక్షణలో భాగంగా నెలకు రూ. 7700 నుంచి రూ. 10 వేలు స్టైఫండ్‌ కంపెనీ చెల్లిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జిల్లాలో ముగ్గురికి రాష్ట్ర

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

కడప ఎడ్యుకేషన్‌ : రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇందులో ప్రొద్దుటూరు మండలం లింగారెడ్డి నగర్‌ ఎంపీపీఎస్‌ పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న షేక్‌ జవహర్‌ మునీర్‌, కాశినాయన మండలం రెడ్డికొట్టాల ఎంపీయూపీ స్కూల్‌లో పనిచేస్తున్న ఎస్‌జీటీ పరిమళ జ్యోతి, పెండ్లిమర్రి మండలం ఎగువపల్లి జెడ్పీ హైస్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ హిందీ ఉపాధ్యాయుడు ఎఫ్‌ఎంఎస్‌ ఖాదర్‌ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వీరంతా ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు విజయవాడ లబ్బిపేటలోని ఏ– కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డులను అందుకోనున్నారు.

షేక్‌ జవహర్‌ మునీర్‌, పరిమళ జ్యోతి, ఎఫ్‌ఎంఎస్‌ ఖాదర్‌

వినాయక నిమజ్జనం  వీడియో వైరల్‌పై కేసు నమోదు   1
1/3

వినాయక నిమజ్జనం వీడియో వైరల్‌పై కేసు నమోదు

వినాయక నిమజ్జనం  వీడియో వైరల్‌పై కేసు నమోదు   2
2/3

వినాయక నిమజ్జనం వీడియో వైరల్‌పై కేసు నమోదు

వినాయక నిమజ్జనం  వీడియో వైరల్‌పై కేసు నమోదు   3
3/3

వినాయక నిమజ్జనం వీడియో వైరల్‌పై కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement