
భక్తిశ్రద్ధలతో ఆరోగ్యమాత ఉత్సవాలు
కడప సెవెన్‌రోడ్స్ : ఆరోగ్యమాత తిరునాల మహోత్సవాలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రార్థనల్లో భాగంగా తొలుత జపమాల, పాటలను ఆలపించారు. ఆరోగ్యమాత స్వరూపాన్ని అలంకరించి పల్లకీలో ఊరేగించారు. గుంటూరుకు చెందిన రెవరెండ్ పాదర్ దేవ దివ్య సత్ప్రసాద ఆరాధన, ప్రార్థనలు నిర్వహించారు. గుంటూరు ఎస్‌జీజేకు చెందిన రెవరెండ్ ఫాదర్ ఆకుల ధర్మరాజు దివ్యబలిపూజ నిర్వహించి భక్తుల కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం గురువులు మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ మరియమాత జన్మదినాన్ని ప్రపంచ వ్యాప్తంగా విశ్వాసులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారని తెలిపారు. ఆ తల్లి ప్రేమ తరిగిపోనిదన్నారు. రెవరెండ్ ఫాదర్ ఎండీ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహాయ గురువులు, కన్యసీ్త్రలు, భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.