
కవనీయం.. శ్రీరంగనాథుని కల్యాణం
రంగనాథస్వామిని దర్శించుకుంటున్న వైఎస్ మనోహర్‌రెడ్డి, కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులు
పులివెందుల టౌన్ : పట్టణంలోని శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో స్వామివారి నూలు పూజా పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయంలో శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు సోమేపల్లె కృష్ణరాజేష్ శర్మ నేతృత్వంలో భక్తులు చల్లా వంశీయుల సహకారంతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవాయిద్యాల నడుమ భక్త జనసందోహంతో వేద మంత్రోచ్ఛారణలతో కమనీయంగా స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ ఇన్‌ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, అంకాలమ్మ దేవస్థాన చైర్మన్ బ్యాటరీ ప్రసాద్, పెద్దిరాజు, తదితరులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ చైర్మన్ సుధీర్ రెడ్డి ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కళ్యాణ అనంతరం చల్లా వంశీయుల సౌజన్యంతో వేలమందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం శ్రీరంగనాథస్వామి గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో శ్రీరంగనాథస్వామి నూలుపూజ పవిత్రోత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.వి.రమణ, ఆలయ చైర్మన్ సుధీకర్ రెడ్డి, శ్రీరంగనాథ ట్రస్ట్ సీఈఓ అల్లం రంగనాయకులు, వాసవీ ఆలయ ప్రధాన అర్చకులు సాయి భరద్వాజ శర్మ, ఆలయ పాలకమండలి సభ్యులు కాంభోజి మల్లికార్జున, దశరథ రామిరెడ్డి, మాధవాచారి, మేడం దినేష్ కుమార్, ఆలయ సిబ్బంది,భక్తులు,తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన శ్రీరంగనాథస్వామి
నూలు పూజ పవిత్రోత్సవాలు

కవనీయం.. శ్రీరంగనాథుని కల్యాణం