వేంపల్లె : నేడు మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, కుమార్తె పీసీసీ చీఫ్ షర్మిల మంగళవారం ఆయన సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. సోమవారం సాయంత్రం వీరు ఇడుపులపాయకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. ఉదయం 8 గంటలకు షర్మిల వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు.
ఇందిరమ్మ కాలనీలో విషాద ఛాయలు
మైదుకూరు : కాలనీలో కొలువుదీర్చిన వినాయకుని ప్రతిమను ఆనందోత్సాహాలతో నిమజ్జనం చేసేందుకు వెళుతూ నొస్సం సురేష్ కుమార్ ఆచారి అనే యువకుడు మృతి చెందడంతో పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం రాత్రి చాపాడు మండలం అల్లాడుపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సురేష్ కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే.
అల్లాడుపల్లె వద్ద ప్రొద్దుటూరు వైపు వెళుతున్న ఓ లారీ వెనుక వైపు నుంచి వినాయకుని విగ్రహంతో వెళుతున్న ట్రాక్టర్‌ను ఢీకొంది. ట్రాక్టర్‌లో ముందువైపు ఇంజన్‌పై కూర్చుని ఉన్న సురేష్ కుమార్ ఎగిరి కిందపడ్డాడు. అతనిపై లారీ దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. మృతునికి భార్య మంజులత, ఇద్దరు కుమారులు ఉన్నారు. సురేష్‌కుమార్ వడ్రంగి పనిలో మంచి నైపుణ్యం ఉన్న కళాకారుడని, అతని మృతి కుటుంబానికి తీరని లోటని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.