
చదువు జీవితంలో ఒక భాగం..
చదువు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ఇప్పటి ప్రపంచంలో మనం బతకడానికి ఎన్నో ఉపాయాలు, సాధనలు, అవకాశాలు ఉన్నాయి. చదువు రాకపోతే బతకలేమనేది అవాస్తవం. ఆత్మహత్య చేసుకునే ముందు విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకోవాలి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని నిండు జీవితాన్ని పాడు చేసుకోవద్దు. విద్యార్థులుగా మీరు ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానేయాలి. అమ్మ, నాన్న, అధ్యాపకులు కూడా పిల్లలు ఏ రంగంలో రాణిస్తున్నారో గుర్తించి.. అందులో వారిని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రస్తుత సమాజ పరిస్థితులకు అనుగుణంగా పెంచుకోవాలి. విద్యార్థుల ప్రవర్తన, కదలికలను అనుక్షణం గమనించాలి. ఇప్పుడున్న యువత క్షణికావేశానికి ఎక్కువగా లోనవుతున్నారు. వారిని ముందే గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తే ఫలితం ఉంటుంది.
– డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఆర్కే వ్యాలీ ప్రభుత్వాసుపత్రి, ఇడుపులపాయ