
శరణు కోరే వారికి అభయమిచ్చే ఆరోగ్యమాత
కడప సెవెన్‌రోడ్స్: తనకు జన్మనిచ్చేందుకు లోక రక్షకుడైన దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని పవిత్రమైన మాతగా శరణుకోరిన వారికి అభయమిచ్చే ఆరోగ్యమాతగా భక్తులు ఆరాధిస్తున్నారని పోరుమామిళ్ల విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ జాలా విజయభాస్కర్ అన్నారు. ఆదివారం ఆరోగ్యమాత ఉత్సవాలు మూడో రోజు సాయంత్రం ఆరోగ్యరాజ్ దివ్యబలి పూజను సమర్పించారు. దేశ దేశ, రాష్ట్ర, ప్రజల శాంతి సమాధానాల కోసం ఆయన ప్రార్థించారు. దేవమాత ద్వారా ప్రజల కోర్కెలను ప్రభువు తీర్చాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా ఆయన విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడి క్షేత్రంలో వెలిసిన దేవమాత ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని వివరించారు. మరియ తల్లి పట్ల భక్తి, విధేయత అందరూ అలవర్చుకోవాలని కోరారు. దేవుని వాక్కులు ఆలపించాలని సూచించారు. మంచి సుగుణాలను దేవుని కృపద్వారా సిద్ధించాలని, అందుకు కావాల్సిన శక్తి తల్లి ద్వారా సమకూరాలని ప్రార్థించారు. అంతకుముందు మరియ తల్లి స్వరూపాన్ని భక్తిశ్రద్ధలతో చర్చి ప్రాంగణంలో విశ్వాసులు ఊరేగించారు. పాటలు, మరియతల్లి తేరు, దివ్య బలిపీఠం అలంకరించారు. ఈ కార్యక్రమంలో మోస్ట్ సిగ్నోర్ రెవరెండ్ ఫాదర్ ఎండీ ప్రసాదరావు, రెవరెండ్ ఫాదర్ విజయరావు, జోసెఫ్‌రాజుతోపాటు డయాసిస్ గురువులు, కన్యసీ్త్రలు, భక్తులుపాల్గొన్నారు.

శరణు కోరే వారికి అభయమిచ్చే ఆరోగ్యమాత