
● మామిడికి బీమా ఏమైంది?
చక్రాయపేట జెడ్పీటీసీ శివప్రసాద్‌రెడ్డి, రామాపురం జెడ్పీ టీసీ వెంకట రమణ, మాట్లాడుతూ గాలి, వాన కారణంగా తమ మండలాల్లో మామిడి పంట రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎకరాకు రూ. 45 వేలు బీమా వస్తుందని ప్రభుత్వం చెప్పడంతో రైతులంతా ప్రీమియం చెల్లించారని తెలిపారు. అయితే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బీమా అందలేదని చెప్పారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బీమా అందేలా చూడాలని కోరారు. జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు కరీముల్లా మాట్లాడుతూ యూరియా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయించకపోతే రైతులు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియజేస్తూ ఫోన్ నంబర్లు ప్రకటించాలన్నారు. జిల్లాలో రైతులు పసుపు బాగా సాగు చేసి కడప మార్కెట్‌యార్డుకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారన్నారు. మార్కెట్‌యార్డులో జేయింట్ షెడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే టాయిలెట్లు, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలన్నారు.