
గంగమ్మ కుంట చెరువు పరిశీలన
లింగాల: మండల పరిధిలోని అంబకపల్లె గ్రామంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో చిన్నపాటి గంగమ్మ కుంటకు భూసేకరణ నిర్వహించి పెద్ద చెరువుగా మార్చడం జరిగింది. అదే విధంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సుమారు రూ.2.50 కోట్ల ఎంపీ నిధులతో హిరోజ్‌పురం నుంచి 4.50 కి.మీ మేర చెరువుకు పైపులైన్‌ను ఏర్పాటు చేసి ఎత్తిపోతల పథకం నెలకొల్పి నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కృష్ణా జలాలు ఎత్తిపోతల పథకం ద్వారా చెరువుకు వస్తుండటాన్ని పరిశీలించారు. అదేవిధంగా చెరువు వద్ద మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జల హారతులు ఇవ్వనున్నారని ఆయన చెప్పారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు సంబంధించి అధికారులతో చర్చించి అనుమతులు పొందిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను ప్రకటిస్తామన్నారు. చెరువు నిర్మాణం, ఎత్తిపోతల పథకం వల్ల గ్రామంలో భూగర్భజలాలు పెంపొంది తాగు, సాగునీరు సమృద్ధిగా అందుతోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బాబురెడ్డి, రైతు విభాగపు కన్వీనర్ సారెడ్డి చంద్రశేఖరరెడ్డి, యూత్ కన్వీనర్ మనోహర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల నాయకులు మల్లికార్జునరెడ్డి, నిరంజన్‌రెడ్డి, నాగేంద్రనాథరెడ్డి, విశ్వరూప జనార్థన్‌రెడ్డి, అంబకపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు చెన్నకేశవరెడ్డి, తేజేశ్వరరెడ్డి, బండి వెంగల్‌రెడ్డి, బండి శ్రీనివాసులరెడ్డి, నాగభూషణరెడ్డి, తదితర వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.