
తపాలా సేవలపై అయోమయం..!
కడప పోస్టల్ సూపరింటెండెంట్ ఏమంటున్నారంటే..
రాజంపేట : ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థను అందిపుచ్చుకుంటూ ఈ–సేవల విస్తరణ కోసం సరికొత్త ప్రయోగాలుచేస్తున్న పోస్టల్‌శాఖ పాతసేవలను మాత్రం ఒకొక్కటిగా రద్దుచేస్తూ వస్తోంది. ఇప్పటికే పలు సేవలు రద్దుకాగా, సెప్టెంబరు 1 నుంచి రిజిస్టర్ పోస్ట్‌సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మరో వైపు లెటర్ రెడ్ (పోస్టట్)బాక్స్‌లను కూడా ఎత్తివేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రధానంగా పోస్టల్ శాఖ నూతన ఒరవడితో ఈ–సేవల విస్తరణపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. మొబైల్‌ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు లేని రోజుల్లో సమాచార వ్యవస్ధకు ఉన్న ఏకై క దిక్కు తపాలానే...అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు మరింత సులువైన సేవలందించేందుకు సాంకేతిక టెక్నాలజికి పోస్టల్ డిపార్టుమెంట్ అప్‌గ్రేడ్ అవుతోంది.
రిజిస్టర్డ్ పోస్టుకు మంగళం
పోస్టల్‌శాఖ రిజిస్టర్ పోస్టు సేవలకు మంగళం పాడనున్నది. తాజాగా బ్రిటిషు కాలం నుంచి వస్తున్న రిజిస్టర్డ్ పోస్ట్‌సేవలు సెపెంబరు1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పోస్టుమాస్టర్లకు శాఖపరమైన నోటీసులు జారీచేసింది. ఒకప్పుడు బంధుమిత్రులకు కబురు పంపాలన్న..ముఖ్యమైన పత్రాలు చేరవేయలన్నా పోస్ట్‌కార్డు లేదా రిజిస్టర్డ్ మాత్రమే అందుబాటులో ఉండేది.
సుమారు 17యేళ్లుగా..
పోస్టల్ వ్యవస్ధ ప్రజల జీవితంలో విడదీయరాని భాగమైంది. కాలంతో పాటు మారిన పోస్టల్ డిపార్టుమెంట్ ఇప్పుడు మరింత ఆధునికసేవలతో మందుకువస్తోంది. 1854లో అప్పటి బ్రిటిషర్ లార్డ్‌డల్హౌసీ ప్రవేశపెట్టిన ఇండియా పోస్ట్ ఆఫీస్ చట్టంతో సేవలు ప్రారంభమైయ్యాయి. అంతకముందుగా 1766లో వారెన్ హేస్టింగ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో కంపెనీ మెయిల్ మొదలైంది. దాదాపు 171యేళ్లుగా ముఖ్యమైన పత్రాలను, వస్తువులను సురక్షితంగా, నమ్మకంగా పంపించడానికి రిజిస్టర్డ్ పోస్ట్ ప్రధాన మార్గంగా నిలిచింది. లీగల్‌నోటీసులు,అపాయింట్‌మెంట్ లెటర్లు, బ్యాంకింగ్ సంబంధిత పత్రాలు వంటి వాటిని పంపడానికి ఎంతగానో ఉపయోగపడింది. పంపిన వస్తువు అవతలివారికి చేరినట్లు రసీదు(డెలవరీ ఫ్రూప్) పొందడం ఒక ప్రత్యేకత, చట్టపరంగాను ఎంతో విలువైంది. ఇది కాస్తా మరో రెండువారాల్లో కనుమరుగు కానున్నది.
స్పీడ్‌పోస్ట్‌లో విలీనం
రిజిస్టర్డ్ పోస్టు సేవను పూర్తిగా స్పీడ్‌పోస్ట్ సేవలో విలీనం చేస్తున్నట్లు తపాలాశాఖ ప్రకటించింది.తపాలాశాఖ తమ సేవలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా దేశీయ పోస్టల్ సేవలు క్రమబద్దీకరణ, పనితీరు మెరుగుపరచడం, ట్రాకింగ్ వ్యవస్ధను బలోపేతం తదితర ప్రక్రియలో భాగంగానే స్పీడ్‌పోస్ట్‌లో రిజిస్టర్డ్ పోస్ట్‌ను విలీనం చేస్తున్నట్లు వెల్లడించింది. స్పీడ్‌పోస్టు అంటే వేగవంతమైన డెలవరీ, ఇప్పుడు రిజిస్టర్డ్ పోస్టు సేవలు స్పీడ్‌పోస్ట్‌లో కలపడంతోడెలవరీలుమరింత వేగవంతం కానుంది. స్పీడ్ పోస్టు ద్వారా పార్శిల్ ఎక్కడి వరకు చేరిందో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇది రిజిస్టర్డ్ పోస్ట్‌లేదు. ఒక సేవ ఉండటం వల్ల పోస్టల్ శాఖ పని మరింత సులభమవతుందని అధికారులు పేర్గొంటున్నారు.
తగ్గిన ఆదరణ.. పెరిగిన సాంకేతికత
వాస్తవంగా రిజిస్టర్డ్ పోస్ట్ వాడకం గణనీయంగా తగ్గింది. వాట్సాప్, జీమెయిల్ వంటి డిజిటల్ మాధ్యమాల రాకతో సమాచార మార్పిడి వేగవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఇప్పుడు డిజిటల్ మార్గంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతోంది. ఐదేళ్ల జరిగిన రిజిస్టర్డ్ పోస్ట్ బుకింగ్ పరిశీలిస్తే 25శాతం పడిపోయింది. స్పీడ్‌పోస్టు, ఇతర కొరియర్‌సేవలు అందుబాటులోకి రావడంతో రిజిస్టర్డ్ పోస్ట్‌కు డిమాండ్ తగ్గింది. అయితే తాజాగా స్పీడ్‌పోస్టుతో చార్జీల మోత తప్పని పరిస్ధితి కనిపిస్తోంది.రిజిస్టర్డ్ పోస్ట్ కనీసం చార్జి రూ.26 నుంచి రూ.30 వరకు ఉంటుంది. స్పీడ్‌పోస్ట్ కనీస చార్జి రూ.41 ఇది రిజిస్టర్డ్ పోస్ట్‌తో పోలిస్తే 20 నుంచి 25 శాతం ఎక్కువ. ఇక చార్జీల భారం భరించకతప్పదు.
రెడ్‌పోస్టు బాక్స్‌పై ఊహగానమే..
రిజిస్టర్డ్ పోస్ట్ సేవల రద్దు నేపథ్యంలో వందల ఏళ్ల చ రిత్ర కలిగిన రెడ్‌పోస్టుబాక్స్‌లు ఎత్తివేత ప్రచారం జోరుగా సాగుతోంది. సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీంతో పోస్టల్ అభిమానులు కలత చెందుతున్నారు. దశాబ్దాలుగా నిస్వార్థంగా నిశ్శబ్దంగా నిశ్చలంగా విశ్వసనీయంగా సేవలు అందించిన భావోద్వేగాల నేస్తం ఇక కనిపించిందన్న బాధ వ్యక్తమౌవుతోంది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవంలేదని , అది ఒక ఊహాగానమేనని మాత్రమే అని పోస్టల్ వర్గాలు అంటున్నాయి. పోస్టల్‌శాఖ ద్వారా ఎరుపు పోస్ట్‌బాక్స్‌లను ఎత్తివేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఏదీ లేదని స్పష్టం చేస్తున్నారు.
ఇప్పటికే రిజిస్టర్డ్ పోస్టల్ సేవల
నిలిపివేత నిర్ణయం
తాజాగా లెటర్‌రెడ్(పోస్ట్)బాక్స్
ఎత్తివేత ప్రచారం
అవి ఊహాగానాలే అంటున్న
తపాలా వర్గాలు
ఈ–సేవ విస్తరణలో పోస్టల్‌శాఖ నిమగ్నం
పోస్టుబాక్స్‌లు ఉండవనే సామాజిక మాధ్యమాల లో జరుగుతున్న ప్రచారంపై కడప పోస్టల్ ఎస్పీ రాజేష్‌ని ‘సాక్షి’ వివరణ కోరింది. ఇప్పటి వరకు పోస్టుబాక్స్‌లు తొలిగింపునకు సంబంధించి ఎ లాంటి ఆదేశాలు రాలేదని ఎస్పీ స్పష్టం చేశారు.