
నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక
కడప కోటిరెడ్డిసర్కిల్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆదివారం కడప పర్యటనకు రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం 7.30 గంటలకు వాయుపుత్ర కేఫ్‌లో ఛాయ్‌పై చర్చా కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కడపలో జరిగే శోభాయాత్రలో పాల్గొనడంతో పాటు.. ఆదిత్య కల్యాణ మండపంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారన్నారు. సాయంత్రం సీపీ బ్రౌన్ గ్రంథాలయం, కొత్తాస్ పరిశ్రమను సందర్శిస్తారని వివరించారు.
నేడు విద్యుత్ బిల్లులు
చెల్లించవచ్చు
కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్ధం ఈనెల 27వ తేది ఆదివారం సెలవు అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథాతథంగా పనిచేస్తాయని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొ ని విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి సంస్థ పురోభివృద్ధికి సహకరించాలని కోరారు.
డీసీఆర్‌బీ కార్యాలయం ప్రారంభం
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో పునరుద్ధరించిన డీసీఆర్‌బీ కార్యాలయాన్ని శనివారం కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ ప్రారంభించారు. అనంతరం కార్యాలయాన్ని పరిశీలించా రు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ఏ.ఆర్ డి.ఎస్.పి కె.శ్రీనివాసరావు, పులివెందుల డి.ఎస్.పి మురళి నాయక్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్ రెడ్డి, ఎస్.ఐ బి.వి కృష్ణయ్య పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం నారమరాజుపల్లెలోని జవహర్‌నవోదయ విద్యాలయంలో 2026–2027 విద్యాసంవత్సరానికి 9 వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్ధులు సెప్టెంబరు 23లోపు దరఖాస్తులు పంపుకోవాలన్నారు. దరఖాస్తు ఫారాలను ఆన్‌లైన్, నవోదయ వెబ్‌సైట్‌లలో ఉంటాయన్నారు.