
వైద్యుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
కడప అర్బన్ : వైద్యుల రిజిస్ట్రేషన్, రెన్యూవల్ తదితర సేవల కోసం విజయవాడకు వెళ్లాల్సిన అవసరం లేదని.. కడప రిమ్స్ ఆవరణలో వైద్యుల రిజిస్ట్రేషన్‌తో పాటు, రీ– రిజిస్ట్రేషన్, రెన్యువల్ సేవలు అందుబాటులో ఉన్నాయని ఏపీ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు నందకిషోర్ అన్నారు. శనివారం వారు సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యులు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రక్రియ ఈనెల 27న కూడా నిర్వహించనున్నారు. ఐఎంఏ ఈసీ మెంబర్ డాక్టర్ వరుణ్‌కుమార్, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్ట ర్ లక్ష్మీనరసమ్మ, కడప జీజీహెచ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, కో–ఆర్డినేటర్ డాక్టర్ ఫహీం, కడప ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అర్జున్‌కుమార్ అవ్వారు తదితరులు పాల్గొన్నారు.