
బాల్య వివాహాల కట్టడికి చర్యలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లాలో బాల్య వివాహాల నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా సీ్త్ర శిశుసంక్షేమశాఖ అధికారి పోలిశెట్టి రమాదేవి తెలిపారు. శనివారం జిల్లా ఐసీడీఎస్ పీడీగా బాధ్యతలు స్వీకరించారు. 2008లో సీడీపీఓగా బాధ్యతలు స్వీకరించిన ఆమె అనంతరం పలు ప్రాంతాల్లో పని చేస్తూ ఇటీవల కల్పించిన పదోన్నతుల్లో కడప ఐసీడీఎస్‌పీడీగా నియామకమయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న పీడీ దేవిరెడ్డి శ్రీలక్ష్మిని మాతృ సంస్థకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా రమాదేవి మీడియాతో మాట్లాడుతూ బరువు తక్కువగా ఉండే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని, అలాగే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు తనవంతుగా కృషిచేస్తానన్నారు. అనంతరం ఆమెను పలువురు సీడీపీఓలు, అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ గాంధీ, డీసీపీఓ సుభాష్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఆమె కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిని కలిసి శాఖపరమైన అంశాలను తెలియజేశారు.
ఐసీడీఎస్ పీడీ రమాదేవి