
ఇంటర్ విద్య బలోపేతానికి కృషి చేస్తా
– ఇంటర్ విద్య నూతన ఆర్‌జేడీ సురేష్‌బాబు
కడప ఎడ్యుకేషన్ : రాయలసీమ పరిధిలోని కడప, కర్నూల్, చిత్తూరు, అనంతపురం జిల్లాల పరిధిలో ఇంటర్మీడియట్ విద్య బలోపేతానికి అందరి సహకారంతో కృషి చేస్తానని ఇంటర్ విద్య ఆర్‌జేడీ సురేష్‌బాబు పేర్కొన్నారు. శనివారం కడప ఇంటర్మీడియట్ విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుల వారి కార్యాలయంలో ఆర్‌జేడీ(ఎఫ్‌ఏసీ)గా సురేష్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. కడప ఆర్‌జేడీగా పనిచేస్తున్న శ్రీనివాసులు గత నెల ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కర్నూల్ జిల్లా డీఐఈఓగా పనిచేస్తున్న సురేష్‌బాబును కడప ఎఫ్‌ఏసీ ఆర్‌జేడీగా నియమించింది.