
ఎండీయూ ఆపరేటర్లకు న్యాయం చేయాలి
బద్వేలు అర్బన్ : ఇంటి వద్ద రేషన్ ఇచ్చే ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి ఆపరేటర్లు, హెల్పర్లకు జీవనోపాధి లేకుండా చేశారని ఎండీయూ ఆపరేటర్ల సంఘం జిల్లా కోశాధికారి నరసింహులు పేర్కొన్నారు. ఆర్డీఓ కార్యాలయ ఏఓకు గురువారం అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా, వరద విపత్తుల సమయంలో నిత్యావసర సరకులు అందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో 9260 మంది నిరుద్యోగులు రోడ్డున పడతారన్నారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతను ఆదుకుంటామని చెప్పిన కూటమి నేతలు ఇలా ఉన్న ఉద్యోగాలను తొలగించడం సరికాదన్నారు. ఎండీయూ వ్యవస్థను పునరుద్ధరించి అందులో పనిచేస్తున్న నిరుద్యోగ యువతను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీయూ ఆపరేటర్ల సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రీనివాసులు, ఆశీర్వాదం, మస్తాన్, గిరి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.