మహాప్రసాదం.. అందిన వారిదే భాగ్యం | - | Sakshi
Sakshi News home page

మహాప్రసాదం.. అందిన వారిదే భాగ్యం

May 10 2025 8:26 AM | Updated on May 10 2025 8:26 AM

మహాప్

మహాప్రసాదం.. అందిన వారిదే భాగ్యం

బ్రహ్మంగారిమఠం : ‘మహాప్రసాదం.. అంది న వారిదే భాగ్యం’ అంటూ భక్తులు పోటీపడ్డా రు. స్వామి వారి ప్రసాదం స్వీకరించడం కో సం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బ్రహ్మంగారిమఠంలో ఆరు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన జగద్గురు శ్రీ మద్విరాట్‌ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. చివరి రోజు మధ్యాహ్నం మహాప్రసాద వినియోగం చేపట్టారు. బియ్యం, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, ద్రాక్ష, యాలక్కలు, ఎండుకొబ్బరి, పాలు తదితరాలతో మహాప్రసాదాన్ని తయారు చేశారు. గర్భాలయంలో స్వామి వారి ఎదురుగా.. ఒక రాశిలా పోసి నివేదించారు. అనంతరం మఠం ఫిట్‌ పర్సన్‌ సి.శంకర్‌బాలాజి, పూర్వపు మఠాధిపతి కుమారులు ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. భక్తులు స్వీకరించి కళ్లకు అద్దుకుని ఆరగించారు. మరికొందరు ఇంటికి తీసుకెళ్లారు. భక్తులతో క్యూలైన్‌లు కిటకిటలాడాయి. మహాప్రసాదానికి ప్రొద్దుటూరు నియోజకవర్గం సంకటితిమ్మాయపల్లెకు చెందిన పోలు ఎరికలరెడ్డి, సుబ్బారెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు.

మహాప్రసాదం విశిష్టత

మహాప్రసాదం అనగా గొప్ప ప్రసాదం అని అర్థం. దేవతలకు నివేదించిన తర్వాత భక్తులకు పంపిణీ చేస్తారు. ఒక్కొక్క చోట ఒక్కో విధంగా ఇస్తారు. తమిళనాడులోని అన్ని శివాలయాల్లో విభూదిని ప్రసాదంగా అందజేస్తారు. అమ్మవారి ఆలయాల్లో కుంకుమ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీరబ్రహ్మేంద్రస్వామి సన్నిధిలో ‘విశేష గుడాన్నం’ అందిస్తారు. దీనిని స్వీకరించిన వారికి సంతానం, వివాహం తదితర కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఉత్సవాలకు హాజరు కాలేని వారికి, తర్వాత వచ్చే వారికి ప్రసాదం అందించే పద్ధతి ఇక్కడ ఉంది. ప్రసాదాన్ని ఎండబెట్టి, తేమ లేకుండా నిల్వ చేసి సుమారు రెండు నెలల వరకు భక్తులకు అందజేస్తారు. కొందరు ప్రసాదాన్ని పార్శల్‌ ద్వారా తెప్పించుకుంటారు. ‘నిద్రపోవు వారికి, నా వద్ద లేని వారికి ప్రసాదం అబ్బదు’ అనేది బ్రహ్మంగారి కాలజ్ఞాన వాక్యం. కావున భక్తులందరూ ప్రసాదం స్వీకరించడానికి అమితాసక్తి ప్రదర్శిస్తారు.

ఉత్సాహ భరితంగా ఉత్సవం

ఉదయం ఉత్సవ కార్యక్రమాన్ని ఉత్సాహ భరితంగా నిర్వహించారు. శ్రీ మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, పీఠంపై అధిష్టింపజేసి, విశేష పూజలు చేశారు. పెద్ద మఠం నుంచి చిన్నమఠం వరకు ఊరేగింపు చేపట్టారు. అక్కడ చిన్నమఠం మఠాధిప తులు శ్రీ వీరశివకుమారస్వామి విశేష పూజలు చేశా రు. ఊరేగింపు తిరిగి పెద్దమఠం చేరుకుంది. కడప పుట్టా యాడ్స్‌కు చెందిన అమృతమ్మ, వెంకటసుబ్బయ్య శ్రేష్టి, లక్ష్మీదేవి ఉభయ దారులుగా వ్యవహరించారు. తెల్లవారు జా మున శ్రీవీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్త నాన్ని ఆగమ వేద పండితులు ఇడమకంటి జ నార్దన శివాచార్య, పోలేపల్లి రామబ్రహ్మం ఆ ధ్వర్యంలో నిర్వహించారు. గర్భాలయంలో ని స్వామి, అమ్మవారి అర్చనామూర్తులకు గంగ, పంచామృతం, క్షీరం, ఫలోదకంలతో అభిషే కం చేశారు. అనంతరం ప్రత్యేక వస్త్రాలంకరణ చేశారు. స్వామి గుణగణాలను కీర్తిస్తూ, 108 నామాలతో స్తుతిస్తూ సహస్ర నామార్చన కా ర్యక్రమం నిర్వహించారు. సాయంత్రం వేద పారాయణం చేశారు. కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతి శ్రీ వీరభోగ వసంతవెంకటేశ్వ ర స్వామి కుమారులు శ్రీ వెంకటాద్రిస్వామి, వీర భద్రయ్యస్వామి, వీరంబొట్లయ్యస్వామి, దత్తా త్రేయస్వామి, గోవిందస్వామి, వరదరా జస్వా మి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నా రు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మఠం ఫిట్‌పర్సన్‌ సి.శంకర్‌బా లాజి, మేనే జర్‌ ఈశ్వరయ్య ఆచారి ఏర్పాట్లు చేశారు. ఎస్‌ ఐ శివప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు.

ముగిసిన వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం

మహాప్రసాదం.. అందిన వారిదే భాగ్యం 1
1/1

మహాప్రసాదం.. అందిన వారిదే భాగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement