లక్ష్యం 16.72లక్షలు.. నాటింది1.94లక్షలు | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం 16.72లక్షలు.. నాటింది1.94లక్షలు

Jul 28 2026 2:00 AM | Updated on Jul 28 2026 2:00 AM

శాఖల వారీగా నాటాల్సిన మొక్కల లక్ష్యం, నాటినవి (లక్షల్లో..)

శాఖ లక్ష్యం నాటినవి

పరిశ్రమలశాఖ 0.20 0.14

ఉద్యావన 0.60 0.37

డీఆర్‌డీఏ 9.30 1.15

పంచాయతీరాజ్‌ 2.00 0.20

మున్సిపల్‌ 2.50 0.06

అటవీ 0.72 0.02

రోడ్లు భవనాలు 0.15 నిల్‌

పీఆర్‌ రోడ్స్‌ 0.15 నిల్‌

నీటి పారుదల 0.20 నిల్‌

వ్యవసాయ 0.30 నిల్‌

ఎకై ్సజ్‌ 0.50 నిల్‌

పోలీస్‌ 0.10 నిల్‌

మొత్తం 16.72 1.94

భువనగిరి: వన మహోత్సవం కార్యక్రమంపై ఎల్‌నినో ప్రభావం పడింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా మొక్కలు నాటే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 16.72 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా.. వర్షాలు లేక ఇప్పటివరకు కేవలం 1.94 లక్షల మొక్కలు అంటే 11.60 శాతం మాత్రమే నాటారు. నర్సరీల్లో వివిధ రకాల మొక్కలతో పాటు, ఉపాధి హామీ కింద గుంతలు కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ.. వరుణుడు కరుణించకపోవడంతో మొక్కలు నాటే పరిస్థితి లేకుండా పోయింది. చాలా ప్రభుత్వ శాఖలు ఇప్పటివరకు ఒక్క మొక్క కూడా నాటకపోవడం గమనార్హం.

2015 నుంచి..

అడవుల శాతం తగ్గడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాలు సకాలంలో పడక కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు సమృద్ధిగా పడాలంటే పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తోంది. గత నెల 18వ తేదీన వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ ఎల్‌నినో ప్రభావంతో ముందుకుసాగడం లేదు.

గుంతలు సిద్ధంగా ఉన్నా..

జిల్లాలో 427 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీని ఏర్పాటు చేశారు. నర్సరీలలో నీడనిచ్చే మొక్కలతో పాటు జామ,నిమ్మ, దానిమ్మ, ఉసిరి, చింత, అల్లనేరేడు వంటి పండ్ల మొక్కలు, గులాబీ, గన్నేరు, మందార తదితర పూల మొక్కలు అందుబాటులోఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా అవెన్యూ ప్లాంటేషన్‌తో పాటు రోడ్లకు ఇరు వైపులా, ప్రభుత్వ స్థలాలు అటవీ ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటేందుకు గుంతలు సైతం తీసి సిద్ధంగా ఉంచారు. వాస్తవానికి ఏటా జూలై నెలాఖరు వరకు గానీ ఆగస్టు మొదటి వారంలో గానీ మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలి. కానీ వర్షాలు పడని కారణంగా మొక్కలు నాటడం లేదు.

ఫ వన మహోత్సవంపై ఎల్‌నినో ఎఫెక్ట్‌

ఫ వర్షాభావంతో ముందుకు సాగని మొక్కలు నాటే కార్యక్రమం

ఫ నర్సరీలకే పరిమితమైన మొక్కలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement