భువనగిరిటౌన్ : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్ పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకా రెడ్డిలతో కలిసి ప్రజల నుంచి మొత్తం 134 అర్జీలను స్వీకరించారు.
ప్రత్యామ్నాయ పంటలు వేయాలి
వర్షాభావ పరిస్థితుల దష్ట్యా రైతులు వరికి బదులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. ఈ నెల 28 నుంచి జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ జయమ్మ, డిప్యూటీ కలెక్టర్లు సాత్విక్, కృతిక తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి హాజరుకాని
మున్సిపల్ కమిషనర్లు
ప్రజావాణికి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు హాజరుకావడం లేదు. జిల్లా అధికారులంతా ప్రజావాణిలో పాల్గొంటుండగా, కమిషనర్లు మాత్రం ప్రతినిధులను పంపుతున్నారు. భువనగిరి మున్సిపాలిటీ తరఫున రెవెన్యూ అధికారి, యాదగిరిగుట్ట నుంచి మేనేజర్ మాత్రమే హాజరయ్యారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


