మహిళల అభ్యున్నతికి ప్రభుత్వాలు పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వాలు పాటుపడాలి

Jul 28 2026 2:00 AM | Updated on Jul 28 2026 2:00 AM

హుజూర్‌నగర్‌ : మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన డిమాండ్‌ చేశారు. సోమవారం హుజూర్‌నగర్‌లో సమాఖ్య నాలుగో జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య జెండాను ఆమె ఆవిష్కరించారు. అనంతరం సృజన మాట్లాడుతూ ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలతో మహిళల అభ్యున్నతి సాధ్యం కాదని, వారి ఆర్థిక స్వావలంబనకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. మహిళలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. లైంగిక వేధింపులు, వివక్షత ఇంకా కొనసాగడం బాధాకరమన్నారు. ప్రభుత్వాలు మహిళల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఉప్పతల కోటమ్మ, పట్టణ అధ్యక్షురాలు ఎల్లావుల ఉమా, అయిలాపురం లక్ష్మీ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి, సభ్యులు సింగినం పుల్లమ్మ, సుందరి పద్మ, కౌన్సిలర్‌ చెనగాని సైదులు, సీపీఐ నాయకులు గుండు వెంకటేశ్వర్లు, కొప్పోజు సూర్యనారాయణ, బద్ధం కృష్ణారెడ్డి, కేవీఎన్‌ మూర్తి, ధనుంజయ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement