రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

Jul 28 2026 2:00 AM | Updated on Jul 28 2026 2:00 AM

మిర్యాలగూడ : దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మిర్యాలగూడ నుంచి దామరచర్ల వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి మరొక ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దామరచర్ల మండల కేంద్రానికి చెందిన పగిడి జీడయ్యయాదవ్‌ తలకు తీవ్ర గాయాలు కాగా.. వాచ్యాతండాకు చెందిన ధరావత్‌ మల్సూర్‌ కాలు విరిగింది. అటుగా వెళ్తున్న ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌ ప్రమాదాన్ని గమనించి వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రులను తన వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఎమ్మెల్సీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement