భువనగిరిలో ఉమ్మడి జిల్లా సెపక్‌ తక్రా పోటీలు | - | Sakshi
Sakshi News home page

భువనగిరిలో ఉమ్మడి జిల్లా సెపక్‌ తక్రా పోటీలు

Jul 28 2026 1:54 AM | Updated on Jul 28 2026 1:54 AM

భువనగిరి : పట్టణంలోని ఇండోర్‌ స్టేడియంలో సోమవారం ఉమ్మడి జిల్లా స్థాయి సెపక్‌ తక్రా లీగ్‌ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ రంగరాజన్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. ఖేల్‌ ఇండియా కోచ్‌, ఆంద్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఆస్మిత క్రీడల పర్యవేక్షుడు జీవీ సుబ్బారావు మాట్లాడారు. యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెపక్‌ తక్రా అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌. శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి వికేష్‌కుమార్‌, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement