ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

Jul 26 2026 7:54 AM | Updated on Jul 26 2026 7:54 AM

యాదగిరిగుట్ట రూరల్‌: రైతులు వరి పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని జిల్లా డాట్‌ కేంద్రం కోఆర్డినేటర్‌, ప్రధాన శాస్త్రవేత్త శ్రీలత అన్నారు. శనివారం యాదగిరిగుట్ట మండలంలోని సాధువెల్లి గ్రామంలో వ్యవసాయంలో ప్రత్యామ్నాయ పంటలు, నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్ల, పంటల మార్పిడి చేయాలని సూచించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వరికి బదులుగా కందులు, పెసర్లు, జొన్నలు, కూరగాయలు, ఆయిల్‌ పామ్‌ వంటివి సాగు చేయాలన్నారు. వరి సాగులో నీటి వృథాను అరికట్టేందుకు మార్చి, మార్చి తడి అందించే పద్ధతి పాటించాలన్నారు. పంటల్లో నీటి సంరక్షణ పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను రైతులకు వివరించారు. అనంతరం తహసీల్దార్‌ గణేష్‌ నాయక్‌ భూ భారతి, భూ సర్వేపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సుంకె ప్రసాద్‌, స్వరూప, ఏఈఓ ప్రణయ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement