ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేస్తుండగా అదుపుతప్పిన బైక్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేస్తుండగా అదుపుతప్పిన బైక్‌

Jul 26 2026 7:54 AM | Updated on Jul 26 2026 7:54 AM

కేతేపల్లి: కేతేపల్లి మండలంలోని తుంగతుర్తి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చెర్కుపల్లి గ్రామానికి చెందిన పోకల నవనీత ఇద్దరు కుమార్తెలు శాన్వి, శ్రేష్ట కేతేపల్లిలోని ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్నారు. శనివారం పాఠశాలకు వచ్చిన శాన్వి అస్వస్థతకు గురైంది. ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది తల్లి నవనీతకు చెప్పడంతో ఆమె అదే గ్రామానికి చెందిన హర్షక్‌తో కలసి బైక్‌పై పాఠశాలకు వచ్చి, ఇద్దరు చిన్నారులను పాఠశాల నుంచి ఇంటికి తీసుకువెళ్తున్నారు. ఈక్రమంలో మార్గమధ్యంలో తుంగతుర్తి గ్రామ శివారులో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేస్తుండగా బైక్‌ అదుపుతప్పి కిందపడింది. రోడ్డుపై పడిపోయిన నవనీత కాళ్లమీదుగా ట్రాక్టర్‌ వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. బైక్‌ నడుపుతున్న హర్షక్‌తో పాటు ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు 108 అంబులెన్స్‌ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. నవనీత పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

ఫ నలుగురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement