యాప్‌లో ఫలితాల నమోదు
రామన్నపేట : ప్రభుత్వ పాఠశాలల్లో రెండో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేందుకు నిర్వహించే తొలి మెట్టు కార్యక్రమం షెడ్యూల్ ఖరారైంది. గతంలో విద్యార్థులకు ఆప్‌లైన్‌లో బేస్‌లైన్ పరీక్ష నిర్వహించేవారు. ఈ ఏడాది మొదటి సారి ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఈనెల 25, 27 తేదీల్లో రెండు విడతలుగా బేస్‌లైన్ పరీక్ష నిర్వహిచంనున్నారు.
విద్యా ప్రమాణాలను మెరుగునకే..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసి వారి బలాలు, బలహీనతలను గుర్తించేందుకు విద్యా శాఖ బేస్‌లైన్ పరీక్షకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో 2 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 13,918 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఫలితాల ఆధారంగా విద్యార్థులకు అవసరమైన ప్రత్యేక బోధనను అందించి, విద్యా ప్రమాణాలను మెరుగు పరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
సామర్థ్యాలు గుర్తించేది ఇలా..
● బేస్‌లైన్ పరీక్ష నిర్వహించడం ద్వారా ప్రాథమిక తరగతుల విద్యార్థులకు రెండు లాంగ్వేజెస్ (తెలుగు, ఇంగ్లిష్)లను చదవడం, రాయడం, చదివింది అర్థం చేసుకోవడం, వంటి భాషా నైపుణ్యాలను పరీక్షిస్తారు.
● సరళ పదాలు, గుణింతాలు, ఒత్తుల పదాలు, వాక్యాలు, పేరాలను నిర్దిష్ట వేగంతో తప్పులు లేకుండా చదివే సామర్థ్యాలను అంచనా వేస్తారు.
● గణితం విషయంలో 1, 2 తరగతుల విద్యార్థులకు సంఖ్యలను గుర్తించడం, కూడికలు, తీసివేతలు 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం అంశాలపై పరీక్ష ఉంటుంది.
● పాఠ్యాంశాల ఆధారంగా కనీస సామర్థ్యాలను పరీక్షించే ప్రశ్నలు ఇచ్చి విద్యార్థులతో పరీక్ష రాయిస్తారు.
పరీక్ష కోసం ప్రశ్నపత్రాలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో జిల్లాలకు, మండలాలకు పంపించారు. పరీక్షల రోజున ఉపాధ్యాయులను లింక్ ద్వారా ప్రశ్నప్రతం ఓపెన్‌చేసి పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తయిన అనంతరం ఫలితాలను తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయనున్నారు. ఆ వివరాలను ఎస్‌సీఈఆర్‌టీఈ విశ్లేషించి విద్యార్థుల అభ్యాస లోపాలను గర్తిస్తుంది. లోపాల నివారణకు ప్రత్యేక ఽభోధన, శిక్షణ కార్యక్రమాలు అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. తద్వారా ప్రతీ విద్యార్తి అభ్యాస స్థాయి స్పష్టంగా తెలిసి విద్యా ప్రమాణాల పెంపునకు మార్గం సుగమం కానుంది.
ఫ 2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు పరీక్ష
ఫ ‘తొలిమెట్టు’లో భాగంగా నేడు, ఎల్లుండి
ఫ మొదటి సారి ఆన్‌లైన్‌లో నిర్వహణ
ఫ ఫలితాల ఆధారంగా ప్రత్యేక బోధన


