ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఆత్మకూరు(ఎం): రాష్ట్రంలో అర్హులైన వారి ఓట్లు మిస్ కాకుండా చూడడం అధికార పార్టీ బాధ్యత అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు(ఎం)లోని జేఏఎస్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఆలేరు నియోజకవర్గ స్థాయి బీఎల్‌ఏల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్‌ఏలు.. బీఎల్‌ఓలకు క్షేత్రస్థాయిలో సహాయ పడడం, ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లా అధికంగా 98.5 శాతం ఎన్యుమరేషన్ పూర్తి చేయడం సంతోషకర విషయమన్నారు. ఆత్మకూరు(ఎం) మండలం తుక్కాపురం–మోత్కూరు రోడ్డు పనులు మూడు రోజుల్లో మొదలు పెట్టి నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. రహీంఖాన్‌పేట–రాఘవాపురం బీటీ రోడ్డు, ఆత్మకూరు(ఎం)–కొరటికల్, మొరిపిరాల బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ జిల్లాలో వంద శాతం మ్యాపింగ్ పూర్తిచేసిన బీఎల్‌ఏలను అభినందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం బీఎల్‌ఏలకు నగదు ప్రోత్సాహకాలు అందించి సన్మానించారు. కార్యక్రమంలో సర్ భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి బసవరాజు సారయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జి లింగంయాదవ్, పీఏసీఎస్ చైర్మన్‌లు యాస లక్ష్మారెడ్డి, అండెం సంజీవరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కందడి అనంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి జన్నాయికోడె నగేష్, మాజీ ఎంపీపీ తండ మంగమ్మ, మాజీ జెడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా పాల్గొన్నారు.


