నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో గురువారం మధ్యాహ్నం సెమిస్టర్ పరీక్షలకు హాజరుకావాల్సిన విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వనందుకు నిరసనగా విద్యార్థి సంఘాల నాయకులు అనుముల సురేష్ వీసీ చాంబర్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అనుముల సురేష్ మాట్లాడుతూ.. హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ అధికారులు వెంటనే విద్యార్థుల హాల్‌టికెట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు దీక్ష కొనసాగుతుందని ఆయన తెలిపారు.


