ఓపెన్‌ స్కూల్‌ పిలుస్తోంది.. | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూల్‌ పిలుస్తోంది..

Jul 24 2026 1:57 AM | Updated on Jul 24 2026 1:57 AM

దరఖాస్తు ఇలా చేసుకోవాలి

పెద్దవూర : చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్‌ స్కూల్‌ వరంలాంటిది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతో పాఠశాల స్థాయిలోనే కొందరు చదువు మధ్యలో ఆపేస్తుంటారు. మరికొందరు పది పూర్తయ్యాక పలు కారణాలతో ఇంటర్‌ చదవకుండా మానేస్తుంటారు. అలాంటి వారి కోసం తెలంగాణ స్టేట్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ(టాస్‌) విధానం కొత్త ఆశలు నింపుతోంది. చదువుకోవాలనే ఆశ ఉన్న ఏ వయస్సు వారైనా మళ్లీ విద్యను కొనసాగించేందుకు గరిష్ట వయోపరిమితి లేకుండా ప్రోత్సహిస్తుంది. రెగ్యులర్‌గా తరగతులకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా స్వీయ అధ్యయనం, అనుకూలమైన సమయంలో పరీక్షలు రాసే వెసలుబాటు కల్పిస్తోంది. ప్రభుత్వం సార్వత్రిక విద్యను 2008–09 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి విద్యార్హత లేనివారి కోసం ముందుగా పదో తరగతి చదివేందుకు అవకాశం కల్పించింది. ప్రవేశాలకు స్పందన, అభ్యాసకులకు మరింత ప్రయోజనం కలిగేలా 2010–11 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ విద్యను అమల్లోకి తీసుకువచ్చింది. ఎంపిక చేసిన మండల కేంద్రాలలో అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలు మండల సమన్వయనకర్తలకు అప్పగించింది. 2026–27 విద్యా సంవత్సరంలో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశాలకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. అపరాధ రుసుంతో ఆగస్టు 29వ తేదీ వరకు అడ్మిషన్లు పొందవచ్చు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 76 టెన్త్‌, 71 ఇంటర్‌ ఓపెన్‌ స్కూల్‌ స్టడీ సెంటర్లు ఉన్నాయి. అందులో నల్లగొండ జిల్లాలో టెన్త్‌కు 42, ఇంటర్‌కు 37, యాదాద్రి భువనగిరి జిల్లాలో టెన్త్‌కు 12, ఇంటర్‌ 8 కేంద్రాలు, సూర్యాపేట జిల్లాలో టెన్త్‌కు 22, ఇంటర్‌కు 26 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో అభ్యర్థులు వృత్తి విద్యా కోర్సును ఆప్షన్‌గా ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీపీ, సీఈసీ ఇతర కోర్సులు ఉంటాయి. తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ భాషలలో చదువుకోవచ్చు.

ఫీజు వివరాలు

● టెన్త్‌లో చేరితే ఫీజు ఓసీ అభ్యర్థులకు రూ.1400, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు రూ.1000తో పాటు అందరూ రూ.150 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి.

● ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్‌కు ఓసీ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు రూ.1200తో పాటు రిజిస్ట్రేషన్‌ ఫీజు అందరూ రూ.200 చెల్లించాలి.

● దరఖాస్తు చేసుకునే వారు స్థానిక పాఠశాలలో సంప్రదించి మీసేవా, ఇతర కేంద్రాలలో ఆన్‌లైన్‌ ద్వారా www.telanganaopenschool.org వెబ్‌సైట్‌ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

● ఫీజు ఆన్‌లైన్‌లో లేదా మీ సేవా కేంద్రాల ద్వారా చెల్లించి ఓపెన్‌ స్కూల్‌ అధ్యయన కేంద్రంలో దరఖాస్తు సమర్పించాలి.

బోధన ఇలా..

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశం పొందిన వారికి కేటాయించిన స్టడీ సెంటర్‌లలో సెలవు రోజులలో తరగతులు నిర్వహిస్తారు. ఏదైనా పాఠశాల, కళాశాలలో 20కు పైగా అడ్మిషన్లు ఉన్నట్‌లైతే వారికి ప్రతీ ఆదివారం, రెండో శనివారం, ఇతర సెలవు దినాలలో తరగతులు నిర్వహిస్తారు. 20 కంటే తక్కువగా అడ్మిషన్లు ఉంటే సమీపంలోని స్టడీ సెంటర్‌లో తరగతులు నిర్వహిస్తారు. ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు అధ్యయన సామగ్రి పంపిణీ చేస్తారు.

ఫ టెన్త్‌, ఇంటర్‌లో అడ్మిషన్లకు ఆహ్వానం

ఫ దరఖాస్తుకు ఈ నెల 28 చివరి తేదీ

ఫ ఉమ్మడి జిల్లాలో 76 టెన్త్‌,

71 ఇంటర్‌ ఓపెన్‌ స్కూల్‌ స్టడీ సెంటర్లు

ఫ ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతిలో ప్రవేశాలకు ఎలాంటి విద్యార్హత లేదు. కనీస వయస్సు 15 ఏళ్లు, ఆపై వయస్సు గల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫ తహసీల్దార్‌ లేదా మున్సిపల్‌ అధికారులు జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం ఉండాలి.

ఫ పాఠశాల స్థాయిలో చదువు మానేస్తే బదిలీ సర్టిఫికెట్‌(టీసీ), ఆధార్‌ కార్డుతో ప్రవేశం పొందవచ్చు.

ఫ ఇంటర్‌లో ప్రవేశం పొందాలంటే తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణత అవ్వాలి.

ఫ ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్‌, 2 పాస్‌పోర్టు సైజు ఫొటోలు దరఖాస్తుకు జత చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement