పెద్దవూర : రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ(సర్) వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటర్లు సర్‌లో తమ వివరాలు నమోదయ్యాయో లేదో తెలుసుకునేందుకు బీఎల్‌ఓలను సంప్రదిస్తున్నారు. అయితే ఇంట్లోనే మొబైల్ ఫోన్‌తో కేవలం ఒక ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా ఓటు వివరాలు సర్‌లో నమోదయ్యాయో లేదో సులభంగా తెలుసుకోవచ్చు.
ఎలా తెలుసుకోవాలంటే..
మొబైల్ ఫోన్‌లో మెసేజ్ ఓపెన్ చేసి ఇంగ్లిష్‌లో ఈసీఐ అని టైప్ చేసి ఆ తర్వాత స్పేస్ ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు నంబర్(ఉదా. ECI ABC123456) టైపు చేసి 1950 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపాలి. వెంటనే ఎన్నికల కమిషన్ నుంచి మీ ఓటుకు సంబంధించిన వివరాలతో ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఇలా వివరాలు వస్తే మీ పేరు సర్ ప్రక్రియలో నమోదు అయినట్లు, రాకపోతే ప్రాసెస్‌లో జాప్యం ఉండటం, సరిగ్గా నమోదు కాలేదని తెలుసుకోవాలి. ఇలా జరిగితే బూత్ లెవల్ అధికారి(బీఎల్‌ఓ)లను సంప్రదించాలి. ప్రతి ఒక్కరూ 1950 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపి తమ సర్‌లో తమ పేరు నమోదయ్యిందో లేదో పరిశీలించుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు సూచిస్తున్నారు.


