మహిళలను సాధికారత వైపు నడిపించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళలను సాధికారత వైపు నడిపించడమే లక్ష్యం

Jul 23 2026 6:54 AM | Updated on Jul 23 2026 6:54 AM

సాక్షి, యాదాద్రి : సీ్త్రనిధి రుణాల ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించి వారిని సాధికారత వైపు నడిపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తెలిపారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో సీ్త్రనిధి అమలుపై అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావుతో కలిసి కలెక్టర్‌ సమీక్షించి మాట్లాడారు. జిల్లాలో సీ్త్రనిధి రుణాల పంపిణీ, రికవరీ, డిజిటల్‌ చెల్లింపులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రుణ లావాదేవీలను సులభతరం చేసేందుకు ప్రతి మహిళా సభ్యురాలు తప్పనిసరిగా మన సీ్త్రనిధి మొబైల్‌ యాప్‌ను వినియోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు డ్రోన్లు, ఇ–ఆటోలు, కార్లు వంటి ఆధునిక ఆదాయ వనరులను సమకూర్చాలని, ఆసక్తి గల మహిళలకు ఉచిత డ్రైవింగ్‌ శిక్షణతో పాటు లైసెన్సులు అందించాలని పేర్కొన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, అదనపు డీఆర్‌డీఓ, సీ్త్రనిధి జోనల్‌ మేనేజర్‌, రీజినల్‌ మేనేజర్‌ పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement