యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర పూజలు | - | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర పూజలు

Jul 23 2026 6:42 AM | Updated on Jul 23 2026 6:42 AM

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని బుధవారం ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. వేకువజామునే ముఖ మండపంలో స్వాతి హోమాన్ని జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు శత ఘటాభిషేకం నిర్వహించారు. ఆలయంలో గజ వాహనసేవ, నిత్య కల్యాణం వైభవంగా జరిపించారు. భక్తులు యాదగిరిగుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. పూజల్లో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య దంపతులు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఈఓ భవానీ శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement