గిద్దలూరు రూరల్, మర్రిగూడ(చింతపల్లి) : దైవ దర్శనం చేసుకుని ఆనందంగా ప్రయాణిస్తున్న ఆ కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. మహానంది నుంచి శ్రీశైలం వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. బస్సును ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో మూడేళ్ల బాలుడు, మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హృదయ విదారక ఘటన బుధవారం ఏపీలోని మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ శివారులో చోటుచేసుకుంది.
మహానంది నుంచి శ్రీశైలం వెళ్తుండగా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గ్రామానికి చెందిన సిద్ధగోని మహేశ్, మానస దంపతులతో పాటు వారి ఇద్దరు కుమారులతో పాటు అదే గ్రామానికి చెందిన శేఖర్(35) కలిసి కారులో తీర్ధయాత్రలకు వెళ్లారు. ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మహానందికి చేరుకున్నారు. మహానందిలో దర్శనం అనంతరం బుధవారం శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి బయల్దేరారు. కారును శేఖర్ నడుపుతున్నాడు. ఏపీలోని మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ సమీపంలోకి రాగానే.. ముందు వెళ్తున్న బస్సును ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. కారు నడుపుతున్న మహేష్ మూడేళ్ల కుమారుడితో పాటు శేఖర్‌తో అక్కడికక్కడే మృతి చెందారు. మహేశ్, మానస దంపతులతో పాటు వారి మరో కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బొలేరో వాహనం డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా గుర్తింపు..
స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. బాధితుల సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా వారు నల్లగొండ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. వెంటనే వారి బంధువులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై గిద్దలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతి చెందిన శేఖర్, మూడేళ్ల బాలుడు
ఫ బొలేరో వాహనాన్ని
ఢీకొన్న కారు.. ఇద్దరు దుర్మరణం
ఫ మృతుల్లో మూడేళ్ల బాలుడు
ఫ మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
ఫ మృతుల స్వస్థలం నల్లగొండ జిల్లా
చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్


