విజ్ఞానంతోనే దేశ అభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

విజ్ఞానంతోనే దేశ అభివృద్ధి సాధ్యం

Jul 23 2026 6:42 AM | Updated on Jul 23 2026 6:42 AM

రామగిరి (నల్లగొండ) : విజ్ఞానంతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని ఎంఎన్‌ఆర్‌ కన్వెన్షన్‌లో నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ) మొదటి స్నాతకోత్సవం, వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే నిజమైన దేశ సేవ అని పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం డిగ్రీతోనే ఆగిపోకుండా ఉన్నత చదువుల వైపు అడుగులు వేయాలన్నారు. విద్యార్థులను స్కిల్‌ రీసోర్స్‌పర్సన్లుగా తీర్చిదిద్దడానికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్కిల్‌ యూనివర్సిటీని స్థాపించిందని తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యాలే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. ప్రిన్సిపాల్‌ సముద్రాల ఉపేందర్‌ మాట్లాడుతూ.. ఎన్జీ కళాశాల చరిత్రలో మొదటిసారిగా స్నాతకోత్సవం నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డిగ్రీలో 18 బంగారు పతకాలు, పీజీలో 5 బంగారు పతకాలను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థి మందడి నర్సిరెడ్డి జియాలజీ సబ్జెక్టులో బంగారు పతకం బహూకరించడానికి తన వంతుగా రూ.2 లక్షల విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ పరీక్షల నియంత్రణాధికారి జి. ఉపేందర్‌రెడ్డి, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్స్‌ పరంగి రవికుమార్‌, అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి డి. మునిస్వామి, అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ బి. నాగరాజు, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరాజు, రామన్నపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రహత్‌ఖానమ్‌, పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్‌ రాజారామ్‌, ఎంఎన్‌ఆర్‌ కన్వెన్షన్‌ యజమాని మందడి నర్సిరెడ్డి, తెలుగు శాఖ అధ్యక్షుడు వెల్దౌడి శ్రీధర్‌, జంతుశాస్త్ర విభాగ అధ్యక్షుడు జ్యోత్స్న, స్టాటిస్టికల్‌ విభాగ అధ్యక్షుడు బొజ్జ అనిల్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్‌ సీహెచ్‌. సుధాకర్‌, అధ్యాపకులు అనిల్‌, అబ్రహం, మల్లేశం, ఎన్‌. కోటయ్య, వాసుదేవ్‌, వేణు, బంగారు పతకాల దాతలు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఫ మహాత్మాగాంధీ యూనివర్సిటీ

వైస్‌ చాన్స్‌లర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌

ఫ ఘనంగా ఎన్జీ కళాశాల

స్నాతకోత్సవం

ఫ టాపర్లకు బంగారు పతకాల అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement