ఆలేరురూరల్: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. గ్రామాల్లోని పిల్లలందరూ తప్పనిసరిగా కేంద్రాలకు వచ్చేలా చేయడమే లక్ష్యంగా తొలిముద్ద పథకాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. దీనిని ఆగస్టు మొదటి వారంలో శ్రీకారం చుట్టనుంది. ఈపథకం కింద చిన్నారులకు అల్పాహారంగా కిచిడీ, ఉప్మా అందించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పోషకాహార లోపం నివారణకు..
జిల్లాలో ఆలేరు, భువనగిరి, మోత్కూరు, రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు నిత్యం పౌష్టికాహారం అందిస్తున్నారు. రోజూ గుడ్డు సైతం ఇస్తున్నారు. అయినా కొందరు చిన్నారులు పౌష్టికాహార లోపంతో పాటు వయసుకు తగిన ఎత్తు, బరువు ఉండటం లేదు. దీనికి ప్రధాన కారణం ఉదయం వేళ ఇంటి వద్ద సరైన ఆహారం తీసుకోకపోవడమేనని గుర్తించిన ప్రభుత్వం ఈ దిశగా అడుగువేసింది. దీన్ని పక్కాగా అమలు చేస్తే చిన్నారుల హాజరు పెరగడంతో పాటు అనారోగ్యం బారిన పడకుండా ఉంటాన్నది ప్రభుత్వ ఉద్దేశం.
ఫ ఆగస్టు నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు
ఫ పోషకాహార లోపం నివారణకు ప్రణాళిక
ఫ 901 అంగన్‌వాడీ కేంద్రాలు
ఫ 46,679 మంది పిల్లలకు ప్రయోజనం
అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు
ప్రాజెక్టులు : 04
కేంద్రాలు : 901
గర్భిణులు : 4,994
బాలింతలు : 3,232
చిన్నారులు : 46,679


