పోచంపల్లిని సందర్శించిన తెలుగు అకాడమీ చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

పోచంపల్లిని సందర్శించిన తెలుగు అకాడమీ చైర్మన్‌

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

భూదాన్‌పోచంపల్లి : చేనేత కార్మికుల స్థితిగతులను తెలుసుకునేందుకు తెలుగు అకాడమీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ మంగళవారం పోచంపల్లిని సందర్శించారు. చేనేత సహకార సంఘాన్ని సందర్శించి కార్మికులు మగ్గాలపై తయారుచేస్తున్న వస్త్రోత్పత్తులను పరిశీలించారు. మార్కెటింగ్‌ సదుపాయాలు, వారికి లభిస్తున్న గిట్టుబాటు ధర, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, ప్రోత్సహాకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత లవకుమార్‌ ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. ఆయన వెంట నిజాం కాలేజీ ప్రొఫెసర్‌ తడక యాదగిరి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement