ఖతార్‌ దేశంలో భారత రాయబారిగా మోత్కూరు వాసి | - | Sakshi
Sakshi News home page

ఖతార్‌ దేశంలో భారత రాయబారిగా మోత్కూరు వాసి

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

మోత్కూరు : మండలంలోని కొండగడపకు చెందిన 2001 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌(ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌) అధికారి కొప్పుల శ్రీకర్‌రెడ్డిని ఖతార్‌ దేశంలో భారత రాయబారిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్‌ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రవంచ వాణిజ్య సంస్థ, విదేశాంగ శాఖలో కీలక విభాగాల్లో ఆయన సేవలందించారు. హైదరాబాద్‌లో ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారిగా మొదలుకొని ఐక్యరాజ్యసమితి వరకు వివిధ హోదాలలో పనిచేశారు. ఆఫ్రికా, అరబ్‌ దేశాలతో భారత్‌ చేసుకున్న చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలలో ఆయన కీలకపాత్ర పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement