యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో చేపట్టిన వర్ష పాశుపత వరుణ యాగం మంగళవారం రెండవ రోజుకు చేరింది. శివాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పండితుల వేత మంత్ర పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాలతో మండపారాధనలు, కలశ స్థాపన, రుష్య శృంగ విగ్రహ స్థాపన, జపములు, పారాయణాలు, అగ్ని ప్రతిష్ఠ వంటి పూజలను నిర్వహించారు. వరుణ దేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురిసేలా చూడాలని వేడుకుంటూ పూజలు జరిపించారు.రాత్రి శివాలయంలో అభిషేకాలు, హవనములు, వరుణానువాక పారాయణాలు, నీరాజన మంత్ర పుష్పాలు, శివ అంతరాలయ జల దిగ్భంధనం, చతుర్వేద పారాయణాలను నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ఈవో భవానీ శంకర్, అధికారులు, పూజారులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.
ఫ యాదగిరి క్షేత్రంలో రెండవ రోజుకు చేరిన వరుణ యాగం


