చిట్యాల : పట్టణంలోని వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ దాడులకు పాల్పడుతున్న కోతులు, కుక్కల బెడద నివారించాలని డిమాండ్ చేస్తూ చిట్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. వీధుల్లో కోతులు, కుక్కలు సంచరిస్తూ చిన్నారులు, వృద్ధులు, మహిళలపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది రోజుల్లోనే పదుల సంఖ్యలో ప్రజలు కోతుల దాడిలో గాయపడ్డారని, అయినప్పటికీ మున్సిపల్ పాలకవర్గం, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కోతులు, కుక్కల దాడుల్లో గాయపడిన వారికి ప్రభుత్వం ఉచిత వైద్య చికిత్సతో పాటు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మెండు సైదులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, జిట్ట బొందయ్య, జమాండ్ల శ్రీనివాసరెడ్డి, బొబ్బల శివశంకర్ రెడ్డి, నిమ్మనగోటి శ్రీనివాస్, ఎస్.కె.అజీమ్, ఆగు అశోక్, మారగోని రమేష్, ఆవుల ఆనంద్, బొల్గూరి సైదులు, జిట్ట శేఖర్, పోకల రమేష్, ఉప్పలపల్లి నగేష్, సాయిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, పోకల రాములు, కూనూరు శంకర్, మన్నన్ తదితరులు పాల్గొన్నారు.


