నకిరేకల్ : నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే రాజీనామా చేయాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా ఆందోళన చేపట్టిన ఏఐసీసీ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నకిరేకల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వేముల వీరేశం పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీని అరెస్టు చేయడం బాధాకరమని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే విధంగా వ్యహరించడం దురదృష్టకరమన్నారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సర్ కోఆర్టినేటర్ మువ్వా విజయ్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్‌నేత, టీపీసీసీ మేనిఫెస్టో మెంబర్ చామల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు లింగాల వెంకన్న, నాయకులు పన్నాల రాఘవరెడ్డి, బచ్చుపల్లి గంగధర్‌రావు, నాగులంచ వెంకటేశ్వరరావు, చౌగోని శ్రీనివాస్, యాసా కరుణాకర్‌రెడ్డి, గాజుల సుకన్య, బ్రహ్మదేవర రమేష్, బొజ్జ సుందర్, కోట మల్లికార్జున్, కొండ శంకర్, ఉగ్గిడి శ్రీనివాస్, కంపసాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ వేముల వీరేశం డిమాండ్


