ల్యాబ్‌ రిపోర్టుల్లో జాప్యం | - | Sakshi
Sakshi News home page

ల్యాబ్‌ రిపోర్టుల్లో జాప్యం

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

ల్యాబ్‌ టెక్నీషియన్లనుఏర్పాటు చేశాం

ల్యాబ్‌ టెక్నీషియన్లు సమ్మె చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వెంటనే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి ప్రత్యేకంగా ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ను ఏర్పాటు చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాం. వెంటనే ఐదుగురిని ఏర్పాటు చేశారు. దీంతో డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో జాప్యం కాకుండా టెస్టులు చేసి రిపోర్టులు ఇస్తున్నాం

–పాండునాయక్‌, జిల్లా జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

భువనగిరి: వేతనాలు అందలేదని ల్యాబ్‌ టెక్నీషియన్లు సమ్మెకు దిగడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లా జనరల్‌ ఆస్పత్రితో పాటు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల నుంచి వచ్చే శాంపిల్స్‌ పరీక్షల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో రిపోర్టులు రెండు రోజులు ఆలస్యంగా వస్తుండటంతో సకాలంలో వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

రోజూ 700 నుంచి 900 వరకు శాంపిల్స్‌

జిల్లా జనరల్‌ ఆస్పత్రి ఆవరణంలో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడికి జనరల్‌ ఆస్పత్రితో పాటు జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో పరీక్షల కోసం రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను ప్రత్యేక వాహనాల ద్వారా పంపిస్తుంటారు. ఏ రోజు వచ్చిన శాంపిల్స్‌కు పరీక్షలు చేసి అదే రోజు సంబంధిత రోగుల సెల్‌ ఫోన్‌కు రిపోర్టులను చేరవేస్తారు. రిపోర్టులు అందిన మరుసటిరోజు ఆస్పత్రికి వెళ్లి వైద్యులచే చికిత్స చేయించుకుంటారు. కానీ వేతనాల కోసం ఈ నెల 1 నుంచి 104కు చెందిన ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ సమ్మెలోకి వెళ్లారు. ప్రస్తుం డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో ఒక్కరే టెస్టులు నిర్వహిస్తున్నారు. దీని వల్ల టెస్టులు నిర్వహించి రిపోర్టులు చేరవేయడంతో ఆలస్యం అవుతోంది. రోజూ తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు సుమారు 700 నుంచి 900 వరకు వివిధ రకాల పరీక్షల కోసం శాంపిల్స్‌ వస్తుంటాయి.

ఫ వేతనాల కోసం టెక్నీషియన్ల సమ్మెబాట

ఫ సిబ్బందిలేక జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో అందని రిపోర్టులు

ఫ సకాలంలో వైద్యం చేయించుకోలేక రోగుల అవస్థలు

Advertisement
 
Advertisement
Advertisement