పెద్దవూర : పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను ట్రేస్ చేసి కనిపెట్టిన పోలీసులు బాధితులకు అప్పగించారు. పెద్దవూర మండలంలోని బెట్టలతండా, గేమ్యనాయక్‌తండాకు చెందిన బాణావత్ శంకర్, షేక్ అబ్దుల్ మజీద్ నెల రోజుల క్రితం తమ సెల్‌ఫోన్లను పోగొట్టుకున్నారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐఎంఈఐ నంబర్, సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఫోన్లను ట్రేస్ చేసి కనిపెట్టారు. ఈ మేరకు బుధవారం ఎస్‌ఐ గోపాల్‌రావు బాధితులకు సెల్‌ఫోన్లు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.


