ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

గట్టుప్పల్‌ : మండలం పరిధిలోని తేరట్‌పల్లి గ్రామానికి చెందిన బొట్ట మణివర్మ(19) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణివర్మ మహబూబ్‌నగర్‌ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో డిగ్రీ ద్వీతీయ సంవత్సరం చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. వారం రోజులుగా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాకుండా సెల్‌ఫోన్‌ చూస్తూ ఉంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించేసరికి అప్పటికే మృతిచెందాడు. బుధవారం మృతుడి తండ్రి బొట్ట యాదయ్య ఫిర్యాదు మేరకు అనుమానాదస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

Advertisement
 
Advertisement
Advertisement