పంటలకు ఎరువులుగా...
నడిగూడెం : వేపలో ఔషధ గుణాలతో పాటు పర్యావరణానికి మేలు చేసే సుగుణాలున్నాయి. వేప నుంచి వేరుచేసిన రసాయనాలు, క్రిమికీటకనాశన గుణాలు కలిగి ఉండడంతో రసాయన కీటక నాశినుల స్థానంలో దీని వినియోగం పెరిగింది. వేప సంబంధ పురుగు మందులు మార్కెట్‌లో లభ్యమవుతున్నా రైతు తమ ఇంటి వద్దే తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే విధానాన్ని మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్ వివరించారు.
వేపగింజల కషాయం తయారీ
వేపలో ఉండే అజాడిరెక్డిన్ అనే పదార్థం పురుగుల జీవిత దశలపై ప్రభావాన్ని చూపుతుంది. వేప ద్రావణాన్ని అన్ని పంటల్లోని లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, నామాల పురుగు, ఆకు ముడత పురుగు, రసం పీల్చే పురుగుల నివారణలో వాడుకోవచ్చు. వేప ద్రావణాన్ని నారుమడులు, పురుగుల నివారణలో ఉపయోగించవచ్చు.
కావాల్సిన పదార్థాలు : వేప గింజలు ఐదు కిలోలు, కుంకుడు కాయలు 500 గ్రాములు, సరుపు పొడి 100 గ్రాములు
తయారు చేయు విధానం : నీడలో బాగా ఎండిన వేప గింజలను పైపొట్టు తీసి మెత్తగా రుబ్బి పిండి చేయాలి. ఈ పించిన ఒక మూటలో కట్టి 10 లీటర్ల నీటిలో 10 నుంచి 12 గంటలు నానబెట్టాలి. తర్వాత మూట నుంచి 15–20 నిమిషాల పాటు ద్రావణాన్ని పిండాలి. మధ్య మధ్యలో మూటను నీటిలో ముంచుతూ ద్రావణాన్ని సేకరించాలి. ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడపోయాలి. వడపోసిన ద్రావణానికి 100 గ్రాముల సరుపుపొడి, లేదా అర లీటరు కుంకుడు కాయరసాన్ని కలపాలి. ఈ వేప గింజల ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరం పొలంలో పిచికారీ చేసుకోవాలి.
ఉపయోగాలు
ఫ వేప గింజలను ప్రస్తుతం మే, జూన్‌లో సేకరించుకొని గోనె సంచుల్లో నిల్వ ఉంచుకోవాలి. ఈ విధంగా సేకరించిన వేప గింజలను సంవత్సరం వరకు నిల్వ ఉంచుకోవచ్చు.
ఫ వేప గింజల ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే పంటపై పిచికారీ చేయాలి. నిల్వ ఉంచొద్దు.
ఫ పంట దశను, పురుగుల ఉధృతిని బట్టి మోతాదు పెంచుకోవాలి.
ఫ వేప ద్రావణాన్ని పండ్ల తోటల్లో కూడా పిచికారీ చేసుకోవచ్చు.
ఫ వేప ద్రావణం చేసిన పిప్పిని ఇంట్లో ఉన్న పెరటి మొక్కలు, కుండీల్లో ఉన్న మొక్కలకు వేసుకోవచ్చు. అన్ని పంటల్లోనూ వారం రోజుల వ్యవధిలో 2–3 సార్లు ఉపయోగించవచ్చు.
ఫ పంట తొలిదశలో ఆశించే రసం పీల్చు పురుగులు, చిన్న లార్వాల నియంత్రణలో వేప ద్రావణాన్ని ఉపయోగించి మంచి ఫలితాలు సాధించవచ్చు.
ఫ పంట పెరిగే కొద్దీ ద్రావణం మోతాదు పెంచుకొని పిచికారీ చేయాలి.
ఫ పప్పు ధాన్యాల్లో ఎండిన వేపాకుల పొడి, గింజల పొడి లేదా నూనె కలిపి పురుగులు సోకకుండా నాలుగు నెలల పాటు భద్రపరచవచ్చు.
పచ్చి ఆకు ఎరువుగానే కాక పురుగులు ఆశించకుండా పనిచేస్తుంది. వేప పిండిని ఎరువుగా వాడినప్పుడు అది వేర్ల వద్ద ఉన్న చెద పురుగులను, నులిపురుగుల నుంచి రక్షిస్తుంది. వేప పిండి పొలంలో వేయడంతో పంటలకు మేలు చేసే పురుగుల సంఖ్య పెరుగుతుంది. నేల స్వభావం కూడా అభివృద్ధి చెందుతుంది.
ఫ వేప ద్రావణాన్ని తక్కువ ఖర్చుతో
ఇంటివద్దే తయారు చేసుకోవచ్చు
ఫ నడిగూడెం మండల
వ్యవసాయాధికారి గోలి మల్సూర్


