జర్నలిస్టులకు భరోసా కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు భరోసా కల్పించాలి

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

నకిరేకల్‌ : రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం భరోసా కల్పించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామనారాయణరెడ్డి కోరారు. నకిరేకల్‌ పట్టణంలో బుధవారం నిర్వహించిన టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా మహాసభలో వారు పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీయూడబ్ల్యూజే నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు అక్రిడిటేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డుల పంపిణీలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. ముందుగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన జర్నలిస్టులు నకిరేకల్‌ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర కమిటీ నాయకుడు ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు కె.నాగయ్య, బుడిగె శ్రీనివాస్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, సాంబశివారెడ్డి, నకిరేకల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు చెరుకు సతీష్‌, సంఘం ప్రతినిధులు రేపాల సతీష్‌, పరమేష్‌, బయన్న, కందగట్ల శ్రీధర్‌, బుడిగె సైదులు, శ్రీనివాస్‌రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.

ఫ ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌ అలీ

Advertisement
 
Advertisement
Advertisement