రేషన్‌ కార్డు ఇప్పిస్తానని.. అక్రమంగా భూమి పట్టా | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ కార్డు ఇప్పిస్తానని.. అక్రమంగా భూమి పట్టా

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

సూర్యాపేట : రేషన్‌ కార్డు ఇప్పిస్తానని చెప్పి, తన కుమారుడు అక్రమంగా భూమి పట్టా చేసుకున్నాడని, దీనిని రద్దు చేయాలని భీంరెడ్డి సరోజనమ్మ బుధవారం ఆర్డీఓ కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఈమేరకు ఆర్డీఓ వేణుమాధవ్‌కు వినతిపత్రం అందించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, తుంగతుర్తి మండలం గానుగుబండలో తమకున్న భూమిని ముగ్గురు కుమారులకు 11 ఎకరాల చొప్పున 33 ఎకరాల భూమిని పంచి ఇచ్చినట్లు తెలిపింది. మరో నాలుగు ఎకరాల భూమిని తమ పోషణ కోసం ఉంచుకున్నామని పేర్కొంది. 2020లో తన భర్త నారాయణరెడ్డి మరణించగా.. అప్పటి నుంచి కుమారులెవరూ తన బాగోగులు చూడలేదని, పెద్ద కుమార్తె చేరదీసిందని చెప్పింది. కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూమిలో 2023లో తన చిన్న కుమారుడు దయాకర్‌ రెడ్డి అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నాడని, ఈ సమయంలో రేషన్‌ కార్డు ఇప్పిస్తానని చెప్పి తనను తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లి అక్రమంగా నా పేరు మీద ఉన్న భూమిని బదిలీ చేసుకున్నట్లు తెలిపింది. రైతుబంధు రాకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కింది. మోసపూరితంగా చేసుకున్న భూమి పట్టాను రద్దు చేసి తనకు న్యాయం చేయాలని ఆమె ఆర్డీఓను కోరింది.

ఫ పట్టా రద్దు చేయాలని

ఆర్డీఓను ఆశ్రయించిన వృద్ధురాలు

Advertisement
 
Advertisement
Advertisement