రామన్నపేట : రామన్నపేటతోపాటు నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో రహదారుల అభివృద్ధికి తగిన నిధులు మంజూరు చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రామన్నపేట మండలం లక్ష్మాపురంలో ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి రామన్నపేట, నీర్నెముల, శోభనాద్రిపురం గ్రామాల సర్పంచ్‌లు, కాంగ్రెస్ నాయకులతో కలిసి స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను మంత్రికి దృష్టికి తీసుకు వెళ్లగా మంత్రి సానుకూలంగా స్పందించారు. పట్టణ కేంద్రంలో రామన్నపేట–అమ్మనబోలు రోడ్డు విస్తరణకు అవసరమైన ప్రతిపాదనలతో తనను కలవాలని స్థానిక నాయకులకు సూచించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తుందన్నారు. మంత్రి వెంట మార్కెట్ వైస్‌చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సర్పంచ్‌లు గరిక సత్యనారాయణ, కందిమల్ల గోపాల్‌రెడ్డి, కంచి మధుసూదన్, డీసీసీ కార్యదర్శి అబ్రహంకుమార్, నాయకులు గంగుల వెంకటరాజిరెడ్డి, వనం చంద్రశేఖర్, గుత్తా నర్సింహారెడ్డి, ఎండీ జమీరొద్దిన్, కొండకింది శేఖర్‌రెడ్డి, పిట్ట రాంరెడ్డి, ఎండీ కరీం, అంజద్, కె.వెంకటేశం తదితరులు ఉన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


