ప్రజల్లో చైతన్యానికి వినూత్న ప్రచారం | - | Sakshi
Sakshi News home page

ప్రజల్లో చైతన్యానికి వినూత్న ప్రచారం

Jun 2 2026 9:43 AM | Updated on Jun 2 2026 9:43 AM

భువనగిరిటౌన్‌ : సమాజంలో నేరాలు, రోడ్డు ప్రమాదాలు, నకిలీ విత్తనాల నివారణే ధ్యేయంగా జిల్లా పోలీస్‌ యంత్రాంగం ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తోంది. వాహనదారులు పాటించాల్సిన నిబంధనలు, హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ప్రాధాన్యతతో పాటు వానాకాలం సీజన్‌లో రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్లతో హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆయా పోస్టర్లను వాట్సాప్‌ స్టేటస్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌, ఎక్స్‌ (ట్విట్టర్‌) వంటి వివిధ సోషల్‌ మీడియా గ్రూపుల్లో షేర్‌ చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement