10లోపు గృహ ప్రవేశాలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

10లోపు గృహ ప్రవేశాలు చేయాలి

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు

యాదగిరిగుట్ట రూరల్‌: ఈ నెల 10వ తేదీ లోపు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు ఆదేశించారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను సోమవారం ఆయన పరిశీలించారు. మిగిలి ఉన్న పనుల వివరాలు అడిగి తెలుసుకుని మాట్లాడారు. రెండు రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో విద్యుత్‌ పనులకు రూ. 2 లక్షల చెక్కును తన ఫండ్‌ నుంచి కేటాయించి, గ్రామ పంచాయతీకి అందజేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి, ప్రతీ ఇంటికి విద్యుత్‌ మీటర్‌ బిగించి కరెంటు సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఒగ్గు రవళి, రాణా ప్రతాప్‌, మాజీ సర్పంచ్‌ కానుగు కవిత, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా జనరల్‌ సెక్రటరీ కానుగు బాలరాజ్‌ గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి లావణ్య, వార్డు సభ్యులు కానుగు రాజీవ్‌ గౌడ్‌, కాల్నె వినోద్‌ కుమార్‌, చిన్నం మల్లేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement