బెంగాల్‌ తరహాలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తాం | - | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ తరహాలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తాం

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

యాదగిరిగుట్ట: బెంగాల్‌ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ అధికారంలోకి వస్తుందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో సోమవారం మేడ్చల్‌ రూరల్‌ జిల్లా పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్‌ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బెంగాల్‌ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి 76 సంవత్సరాలు నిరీక్షించాల్సి వచ్చిందన్నారు.పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ శిక్షణ శిబిరంలో మేడ్చల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఫ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌

Advertisement
 
Advertisement
Advertisement