వైద్య రంగంలో నూతన ఒరవడి
కొత్త రెవెన్యూ డివిజన్..
మండలాలు
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.
వాతావరణం
ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.సాయంత్రం అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
- 8లో
జిల్లాలో వైద్య పరంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. బీబీనగర్ వద్ద నిమ్స్‌ను ఎయిమ్స్ ఆస్పత్రిగా ప్రకటించారు. రూ. 1300 కోట్లతో భవనసముదాయాల నిర్మాణం పూర్తి కావొచ్చింది. 15 రకాల అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. రోజూ 2500 మంది ఔట్‌పేషెంట్లకు వైద్యం చేస్తున్నారు. భువనగిరిలో యాదాద్రి మెడికల్ కళాశాలను 50 సీట్లతో గత సంవత్సరం ప్రారంభించారు. నర్సింగ్ కళాశాలను 60 మంది విద్యార్థులతో ప్రారంభించారు. భువనగిరిలో జిల్లా కేంద్ర ఆస్పత్రిని 100 పడకల నుంచి 225 పడకలకు అప్ గ్రేడ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగింది. జిల్లాలోని ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె, బస్తీ దవాఖానాలుగా ఏర్పాటు చేసి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా మార్చారు. ఇందులో 99 గ్రామీణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుండగా నాలుగు బస్తీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలున్నాయి. జిల్లా కేంద్రంలో 157 పరీక్షలను అందించే విధంగా టీ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి తోపాటు ఆలేరు, చౌటుప్పల్ లో ఐదేసీ పడకలతో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేసి కిడ్నీబాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు.


