సాక్షి, యాదాద్రి: యదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖకు ఘనమైన గౌరవం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక అవార్డుల్లో జిల్లాకు చెందిన ఆరుగురు అధికారులను సేవా పతకాలు వరించాయి. ఆలేరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సీహెచ్. యాదగిరి అందించిన విశేష సేవలకు ప్రభుత్వం పోలీస్ ఉత్తమ సేవా పతకం ప్రకటించింది. గతంలో సేవా పతకం అందుకోవడంతో పాటు, బొమ్మలరామారం దిశ కేసు పరిశోధన, పలు కీలక కేసుల దర్యాప్తు, ఆల్ ఇండియా డ్యూటీ మీట్‌లో మెడల్స్ సాధించడం, కోచ్‌గా వ్యవహరించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అత్యున్నత పురస్కారానికి ఆయనను ఎంపిక చేశారు. యాదాద్రి జిల్లా నుంచి ఈ ఏడాది ఈ పతకానికి ఎంపికై న ఏకై క అధికారి ఆయనే కావడం విశేషం. ఈ అవార్డు కింద మెడల్‌తో పాటు రూ. 30,000 నగదు బహుమతి లభిస్తుంది. రవీంద్రభారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పతకాన్ని త్వరలో ప్రదానం చేయనున్నారు.
తుర్కపల్లి ఎస్‌ఐతో పాటు మరో నలుగురికి..
విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన జిల్లాకు చెందిన ఐదుగురు పోలీస్ అధికారులకు సేవా పతకాలు దక్కాయి. వీరిలో తుర్కపల్లి ఎస్‌ఐ మహమ్మద్ తఖియొద్దీన్‌తోపాటు జిల్లా కేంద్రంలో ఫింగర్ ప్రింట్ యూనిట్ హెడ్ కానిస్టేబుల్ ఎం.డీ. హబీబుద్దీన్, జిల్లాకేంద్రంలో ఏఆర్ హెడ్‌కానిస్టేబు ళ్లు తోకల సంతోష్‌రెడ్డి, మారోజు రాములు, కేమిడి రమేష్‌లు ఉన్నారు. ఈ సేవా పతకాలను జిల్లా ఎస్పీ ద్వారా విభాగానికి పంపించి, స్థానికంగా అందించనున్నారు. ఎటువంటి రిమార్కులు లేకుండా నిరంతరం ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఈ అవార్డులు దక్కడంపట్ల ఎస్పీ అక్షాంశ్ యాదవ్‌తోపాటు జిల్లా పోలీసు యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
ఫ మరో ఐదుగురికి సేవా పతకాలు
ఫ ప్రకటించిన ప్రభుత్వం


